WordPress, ఇది ఒక కంటెంట్ మానేజ్మెంట్ సిస్టం (CMS), వర్డుప్రెస్ ని ఉపయోగించి ఇంటర్నెట్ మొత్తం మీద దాదాపు 35% పైగా వెబ్సైట్లను డెవలప్ చేసారు. వర్డుప్రెస్ లాగానే వేరే కంటెంట్ మానేజ్మెంట్ సిస్టమ్స్ అందుబాటులో ఉన్నప్పటికీ Web Designers ఎక్కువగా వర్డుప్రెస్సునే ఉపయోగించడానికి ఇష్టపడతారు , దానికి కారణాలు ఏంటో మనం ఈ బ్లాగ్ లో ఇంకా ముందు ముందు తెలుసుకుందాం. కంటెంట్ మానేజ్మెంట్ సిస్టం తో డిజైన్ చెయ్యబడిన వెబ్సైట్స్ లో 62% వర్డుప్రెస్ ని ఉపయోగించి డెవలప్ చేసారు. ఈ నంబర్స్ బట్టి మనకి అర్ధం అయ్యి ఉండాలి వర్డుప్రెస్ కి వెబ్ డిజైన్ లో ఎంత ఇంపార్టెన్స్ ఉంది అని.
వర్డుప్రెస్సు తో మనం ఒక చిన్న బ్లాగ్ సైట్ నుంచి పెద్ద ఈ-కామర్స్ సైట్ వరకు అన్ని విధమైన వెబ్సైట్లను డెవలప్ చేయగలము, అందులో కొన్నిఈ కింద ఉన్న లిస్ట్ లో చూద్దాము….
- బ్లాగ్ వెబ్సైట్స్ ,
- ఈ-కామర్స్ వెబ్సైట్స్
- మెంబర్షిప్ వెబ్సైట్స్
- సోషల్ ఫోరమ్
- ఆన్లైన్ బుకింగ్ వెబ్సైట్స్
- పోర్ట్ఫోలియో వెబ్సైట్స్
- ఈవెంట్ వెబ్సైట్స్
- వెడ్డింగ్వెబ్సైట్స్…
ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ చాలా పెద్దగా ఉంటాది, వర్డుప్రెస్ లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ అలాంటిది, అందుకే అందరూ వర్డుప్రెస్ ని ఉపయోగించడానికి ఇష్టపడతారు.
WordPress ఎందుకు ఉపయోగించాలి
ఇప్పుడు మనం వర్డుప్రెస్ యొక్క స్పెషల్ ఫీచర్స్ లోకి వెళ్దాం, దేనినైనా ప్రపంచం లో అంత మంది ఇష్టపడి యూస్ చేస్తున్నారు అంటే అందులో ఎంతో కొంత ప్రత్యేకత ఉండకుండా పోదు.
WordPressని ఎవరైనా సులభంగా నేర్చుకోగలరు
వర్డుప్రెస్ తో వెబ్సైట్ ను డిజైన్ చెయ్యడానికి ఎటువంటి కోడింగ్ పరిజ్ఞ్యానం అవసరం లేదు, వర్డుప్రెస్ అనేది కంటెంట్ మానేజ్మెంట్ సిస్టం కాబట్టి, మనకి అక్కడ ఉన్న కంటెంట్ ని ఎలా మేనేజ్ చేయగలమో తెలిస్తే చక్కని వెబ్సైట్స్ డిజైన్ చెయ్యగలం.
WordPress ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్
ఇది అతి ముఖ్యమైన పాయింట్, విక్స్ లాంటి ఇతర కంటెంట్ మానేజ్మెంట్ సిస్టం తో కంపేర్ చేస్తే వర్డుప్రెస్ లో ఉన్న ఈ స్పెషలిటీ ని మనం గుర్తించొచ్చు, వర్డుప్రెస్ GPLv2 లైసెన్స్ క్రింద వస్తుంది, అంటే దానిని ఎవరైనా డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ గా ఇన్స్టాల్ చేసుకొని వాడుకోవచ్చు అని అర్ధం.
WordPress ఎక్సటెన్సిబుల్ CMS
ఒక్క వర్డుప్రెస్ తో మనం ఎన్ని రకమైన వెబ్సైట్స్ ని డిజైన్ చేయగలమో పైన ఉన్న లిస్ట్ లో చూసాం, అది ఒక పెద్ద అడ్వాంటేజ్ అనే చెప్పుకోవాలి, అన్ని ఫంక్షనాలిటీస్ కి ఒకే CMSని ఉపయోగించి మన అవసరానికి అనువుగా మార్చుకోగలం.
WordPress థీమ్స్ & ప్లగిన్స్
వర్డుప్రెస్ డైరెక్టరీ లో 55,000+ ప్లగిన్స్ & 7,500+ థీమ్స్ మనం డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోడానికి రెడీ గా ఉన్నాయ్. అంటే మనకి వెబ్సైట్ లో ఏ ఫంక్షన్ కావాలి అన్నా దానికి ఒక ప్లగిన్ రెడీ గా ఉంటుంది, దానిని మనం మన వెబ్సైట్ లో ఇన్స్టాల్ చేసుకొని మన అవసరానికి అనువుగా దానిని మార్చుకోవలసి ఉంటుంది.
WordPress కమ్యూనిటీ
వేరే ఏ ఇతర వెబ్ టెక్నాలజీ కి లేని కమ్యూనిటీ వర్డుప్రెస్ కి ఉంది, ఫేస్బుక్ గ్రూప్స్, ఫోరమ్స్, బ్లాగ్స్, యూట్యూబ్ వీడియోస్, ఇలా ప్రతీ చోట వర్డుప్రెస్ కి సంబందించిన ప్రతీ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్ లో అందుబాటు లో ఉంటుంది. సో, మనకి ఏ ప్రాబ్లెమ్ వచ్చిన బ్రౌజ్ చేసి లేదా ఫోరమ్స్ లో ఇతర యూజర్స్ ని అడిగి తెలుసుకొని మనం ఎదురుకున్న ప్రాబ్లెమ్ ని వెంటనే సాల్వ్ చేసుకోవచ్చు.

