Domain Name అంటే ఏమిటి?: మన వెబ్సైట్ URLని డొమైన్ నేమ్ అని పిలుస్తాం. డొమైన్ నేమ్ అనేది ఇంటర్నెట్ లో మన వెబ్సైట్ అడ్రస్ లాంటిది, ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి రావాలి అంటే మన ఇంటి అడ్రస్ ఎలా అవసరమో, మన వెబ్సైట్ కి రావాలన్నా మన వెబ్సైట్ అడ్రస్ లేదా డొమైన్ నేమ్ వాళ్లకి తెలిసి ఉండాలి. అయితే మనం స్కూల్ లో చదువుకొని ఉంటాం, కంప్యూటర్స్ కి కేవలం 1’s and 0’s మాత్రమే అర్ధం అవుతాయి అని, మరి ఇక్కడ మన Domain Names అనేవి ఇంగ్లీష్ లో ఉన్నా కూడా కంప్యూటర్ కి ఎలా అర్ధం అవుతాయి అని డౌట్ రావొచ్చు. ఇక్కడే అసలు పాయింట్ దాగి ఉంది, మనం చూసే డొమైన్ అడ్రస్ కేవలం మనుషులుగా మనకి గుర్తు ఉండడానికి మాత్రమే. నిజానికి డొమైన్ నేమ్ అనేది కూడా నంబర్స్ లోనే ఉంటుంది. అయితే మనం అన్ని నంబర్స్ ని గుర్తుంచుకోలేము కాబట్టి వాటిని నేమ్స్ లోకి translate చేసుకుంటాము. నేమ్స్ లో ఉన్నాయ్ కాబటికి మనం ఎన్ని వెబ్‌సైట్స్ ని అయినా గుర్తు ఉంచుకోగలుగుతున్నాం, లేకపోతే అన్ని IP అడ్రస్‌లను మనం గుర్తు ఉంచుకోలేం.
డొమైన్ నేమ్ ఎలా పనిచేస్తుంది?
మనం వెబ్సైట్ అడ్రస్ లేదా Domain Name ని మన సెర్చ్ ఇంజిన్ లో ఎంటర్ చెయ్యగానే అది మన వెబ్సైట్ నేమ్ ని నెంబర్స్ లోకి కన్వెర్ట్ చేసుకొని డొమైన్ నేమ్ సర్వర్ కి రిక్వెస్ట్ పంపుతుంది, అక్కడ మన హాస్టింగ్ కంప్యూటర్ లో మనం వెబ్సైట్ ఎక్కడ అయితే ఉందో అది తిరిగి మన సెర్చ్ ఇంజిన్ కి ఫార్వర్డ్ చేస్తుంది, ఆ విధంగా మనం మన వెబ్సైట్ ని డొమైన్ నేమ్ తో access చెయ్యగలం.
వివిధ రకమైన డొమైన్ నేమ్స్
డొమైన్ నేమ్స్ లో ముఖ్యంగా మూడు రకాలు ఉన్నాయ్
- టాప్ లెవెల్ డొమైన్ (TLD)
- కంట్రీ కోడ్ టాప్ లెవెల్ డొమైన్ (ccTLD)
- స్పాన్సర్ టాప్ లెవెల్ డొమైన్ (sTLD)
టాప్ లెవెల్ డొమైన్ (TLD)
Top Level Domain అంటే మనం మాములుగా GoDaddy, BigRock, NameCheap లో మనం కొనుక్కోడానికి వీలుగా ఉండే డొమైన్స్. వీటిలో ఎక్సటెన్షన్స్ చాలా రకాలుగా ఉంటాయి. For Example: .com, .org, .live, .info, .store, .biz, .me etc
కంట్రీ కోడ్ టాప్ లెవెల్ డొమైన్ (ccTLD)
Country Code Top Level Domain అంటే కంట్రీ కోడ్ ఆధారంగా పిలవబడతాయి, For Example ఇండియా కి .in అని, కెనడా కి .ca అని, ఆస్ట్రేలియా కి .au అని. వీటిని ముఖ్యంగా కేవలం ఆ దేశం లో మాత్రమే బిజినెస్ చేసే వాళ్లు మరియు కేవలం ఆ దేశం లోనే ఆడియన్స్ ఉండే వ్యాపారులు మరియు బ్లాగు సైట్లు వాడుతారు.
స్పాన్సర్ టాప్ లెవెల్ డొమైన్ (sTLD)
Sponsor Top Level Domain అంటే ఒక దేశాన్ని రిప్రెసెంట్ చేసే డొమైన్స్. For example ఎడ్యుకేషన్ సైట్లకు .edu అని, గవర్నమెంట్ సైట్లకు .gov.in అని.
Domain Name ఎంచుకోవడం ఎలా?
వెబ్సైట్ మొదలుపెట్టే ప్రక్రియ లో Domain Name ఎంచుకోవడం అనేది చాలా ముఖ్యమైన పాయింట్, ఎందుకంటే ఒక్కసారి మీరు డొమైన్ నేమ్ కొన్న తర్వాత మీ బిజినెస్ కి అదే అడ్రస్ గా ఉంటుంది. ఎవరైనా మీ బిజినెస్ నేమ్ చెప్పగానే మీ డొమైన్ నేమ్ గుర్తు వచ్చేలా ఉంటె అది మీకు చాలా ఉపయోగపడుతుంది . డొమైన్ నేమ్ ఎలా ఉండాలి అంటే ఎవరికైనా సులభంగా గుర్తు ఉండేలా ఉండాలి. డొమైన్ నేమ్ కాస్ట్ అనేది మన డొమైన్ లో ఉండే వర్డ్స్ బట్టి కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. మనం ఏక్కువ ట్రాఫిక్ ని అట్ట్రాక్ట్ చెయ్యగలిగే డొమైన్ నేమ్ ని కొనాలి అనుకుంటే కొంచెం ఏక్కువ ఖర్చుపెట్టాల్సి వస్తుంది, లేదు అనుకుంటే 100 రూపాయలకి కూడా డొమైన్ నేమ్స్ అనేవి దొరుకుతాయి.
