వర్డుప్రెస్ డిజైన్ లో మీడియా ఫైల్స్ అనేవి చాలా ముఖ్యం. అంటే, మనం ఏదైనా పోస్ట్ లేదా పేజీ ని డిజైన్ చేసినప్పుడు దానికి మనం కచ్చితంగా ఇమేజెస్, వీడియోస్, లేదా పిడిఎఫ్ ఫైల్స్ లాంటివి జత చేస్తాం. అయితే మనకి ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుంది అంటే ఫైల్ సైజ్ ఉండవలసిన దాని కన్నా ఎక్కువ ఉన్నపుడు వర్డుప్రెస్ మన మీడియా ఫైల్ ని అప్లోడ్ అవ్వకుండా రిజెక్ట్ చేస్తుంది, ఆ ఎర్రర్ మనకి ఎలా కనిపిస్తుంది అనేది కింద ఉన్న ఫోటో లో చూడొచ్చు
అయితే, మనకి ఈ ఎర్రర్ ఎందుకు వస్తుంది అంటే, మన హాస్టింగ్ సర్వీస్ ప్రొవైడర్ మనకి ఇచ్చిన cPanel లో ఉపాలవుడ్ లిమిట్ అనేది సెట్ చేసి ఇస్తారు. కాబట్టి మనం వాలు సెట్ చేసిన సైజ్ కన్నా ఎక్కువ సైజ్ ఉన్న ఇమేజ్, వీడియో లేదా PDF ని మనం మన మీడియా లైబ్రరీ లోకి అప్లోడ్ చెయ్యలేం.
అయితే దానిని మనం చాలా సింపుల్ గా మన cPanel లోనికి లాగిన్ అయ్యి ఆ లిమిట్ ని పెంచుకోవచ్చు. పెంచుకున్నట్టు అయితే మనం ఎంత సైజ్ ఉన్న మీడియా ఫైల్ ని అయినా మనం సింపుల్ గా వర్డుప్రెస్సు లోకి అప్లోడ్ చెయ్యొచ్చు.
ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మనం ఎప్పుడైనా మన మీడియా సైజ్ ని ఎంత తక్కువ ఉంచుకుంటే మన సైట్ పెర్ఫార్మన్స్ అంత బాగుంటది. ఎందుకంటే మన మీడియా ఫైల్ గనుక సైజ్ ఎక్కువ ఉన్నటు అయితే మన పేజ్ లోడ్ అవ్వడానికి ఎక్కువ టైం పడ్తుంది, దాని వాళ్ళ మన సైట్ ట్రాఫిక్ అనేది తగ్గుతుంది.
మీరు మీ మీడియా అప్లోడ్ లిమిట్ ని గనుక పెంచుకోవాలి అనుకుంటే కింద ఉన్న వీడియో ని చుడండి.

