You are currently viewing ఉచితంగా వర్డుప్రెస్ నేర్చుకోండి ఇలా

ఉచితంగా వర్డుప్రెస్ నేర్చుకోండి ఇలా

Share this article

మనలో చాలా మందికి వర్డుప్రెస్ నేర్చుకోవాలి అని, దాని ద్వారా బ్లాగ్గింగ్ చేసి లెద్దా ఫ్రీలంసింగ్ చేసి డబ్బులు సంపాదించాలి అనుకుంటాం. కానీ ముందుగా మనం కొంత పెట్టుబడి పెట్టాలి అంటే ఆలోచిస్తాం.
పెట్టుబడి ఎందుకు పెట్టాలి అంటే డొమైన్ కొనడానికి అలాగే హాస్టింగ్ కొనడానికి. ఇంటర్నెట్ మనకి ఎలాగూ చౌకగా లభిస్తుంది కాబట్టి మనం దానిని లెక్క లూకి తీసుకోవట్లేదు.
అయితే మనలో చాలా మంది ముందుగా పెట్టుబడి పెట్టాలి అంటే ఆలోచిస్తాం, ఎందుకంటే మనకి దాని గురించి పూర్తిగా తెలీదు అలాగే అది మన వాళ్ళ అవుతుందో లేదో అని ఒక సందేహం. తప్పు లేదు, డబ్బుని ఖర్చు పెట్టేముందు ఇలా ఆలోచించడం మంచిదే.
అయితే వర్డుప్రెస్ ని ఉచితంగా నేర్చుకోడానికి మనకి ఒక మార్గం ఉంది. అదే LocalHost లో వర్డుప్రెస్ ని ఇన్స్టాల్ చేసుకొని నేర్చుకోవడం. ఇప్పుడిప్పుడే వర్డుప్రెస్ గురించి తెలుస్కుంటున్న వాలు, అలాగే ఒకసారి ఇది ఎలా ఉంటాడో ట్రై చేద్దాం అనుకునేవాల్లకి ఇది చాలా ఉపయోగపడ్తుంది. మనం ఈ ప్రకియ ని పూర్తి చెయ్యడానికి ఒక ఫ్రీ సాఫ్ట్వేర్ ని ఉపయోగిస్తాము. కాబట్టి మనం ఈ ప్రాసెస్ ని పూర్తిగా ఉచితం అని చెప్పొచ్చు.

LocalHost లో ఇన్స్టాల్ చెయ్యడం అంటే మన కంప్యూటర్ లేదా లాప్టాప్ లో వర్డుప్రెస్ ని ఇన్స్టాల్ చేసుకొని ఉపయోగింహదం, అయితే దీని వాళ్ళ మనకి డొమైన్ మరియు హాస్టింగ్ కొనే ఖర్చు మిగుల్తుంది. అయితే ఇంటర్నెట్ మాత్రం కచ్చితంగా ఉండాలి, ఎందుకంటే మనం వర్డుప్రెస్ లో ప్లగిన్స్ మరియు థీమ్స్ ని ఇన్స్టాల్ చేసుకోడానికి ఇంటర్నెట్ ఉండాలి. లేకపోతే మనం వాటిని డౌన్లోడ్ చెయ్యలేం.
లోకల్ హోస్ట్ లో ఇన్స్టాల్ చెయ్యడం వల్ల మనకి ఉన్న ఒకే ఒక్క తేడా ఏంటి అంటే మనం కేవలం మన సిస్టమ్ లో మాత్రమే సైట్ ని చూడగలం.
మాములుగా అయితే వర్డుప్రెస్ ని మనం ఇంటర్నెట్ ని కనెక్ట్ అయ్యి ఉన్న సర్వర్ లో ఇన్స్టాల్ చేసి దానిని మన డొమైన్ కి లింక్ చేస్తాం కాబట్టి ప్రతి సిస్టం లో మన డొమైన్ నేమ్ ఎంటర్ చేస్తే సైట్ ఓపెన్ అవుతుంది. కానీ ఇక్కడ వర్డుప్రెస్ ని కేవలం మన సిస్టం లో ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి అది మన సిస్టం లో మాత్రమే ఓపెన్ అవుతుంది.

అయితే ఇది కేవలం మనం నేర్చుకోడానికి ఉపయోగిస్తున్నాం కాబట్టి మనకి పెద్దగా సమస్య అనేది ఉండదు. లోకల్ హోస్ట్ లో మనం వర్డుప్రెస్ నేర్చుకుని మనకి పూర్తి కాంఫిడెన్స్ వచ్చాక మనం లోకల్ హోస్ట్ నుంచి దానిని డొమైన్ లూకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు
ఉచితంగా మీ సిస్టం లో వర్డుప్రెస్ ని ఇన్స్టాల్ చెయ్యడానికి కింద ఉన్న వీడియో ని చుడండి.


Share this article

Leave a Reply