You are currently viewing Drag and Drop Builder అంటే ఏమిటి?

Drag and Drop Builder అంటే ఏమిటి?

Share this article

Drag and Drop Builder, పేరులోనే దీని అర్ధం కూడా ఉంది. వర్డుప్రెస్సు లో మనం ఏదైనా పేజ్ ని డిగ్ చెయ్యాలి అంటే మనకి ఒక వెబ్సైటు బిల్డర్ అనేది అవసరం ఉంటుంది. అయితే వర్డుప్రెస్ లో డ్రాగ్ అండ్ డ్రాప్ బిల్డర్ అనేది డిఫాల్ట్ గా ఉండదు, మనం దానిని మళ్ళీ సెపరేట్ గా ఇన్స్టాల్ చేసుకోవాలి.
ఈ ఆర్టికల్ లో మనం టాప్ 2 Drag and Drop Builders గురించి చూద్దాం, ఒకటి ఫ్రీ బిల్డర్ ఇంకొకటి ప్రీమియం బిల్డర్, అంటే దానిని మనం వాడుకోవాలి అంటే కొంత అమౌంట్ అనేది పే చేసి కొనుక్కోవాలి.

ముందుగా మనం Drag and Drop Builder అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తాది అని క్లియర్ గా చూద్దాం. మనం మామూలుగా చూసే వర్డుప్రెస్ పేజీ ఎడిటర్ అనేది ఇలా ఉంటాది.

wordpress editor

అయితే ఇందులో మనకి బేసిక్ ఒప్షన్స్ తప్పించి అడ్వాన్స్డ్ ఆప్షన్స్ అనేవి పెట్టాలి అనుకుంటే మనం HTML లేదా CSS ని ఉపయోగించి డిజైన్ చేసుకోవాలి. మనం వర్డుప్రెస్ ని ఉపయోగించేది కోడింగ్ లేకుండా సింపుల్ గా అవుతుంది అని కానీ మళ్ళీ ఇక్కడ HTML, CSS అంటున్నా అని కన్ఫ్యూజు అవ్వకండి. ఈ ప్రాసెస్ ని సింపుల్ చేయడానికే మనం డ్రాగ్ అండ్ డ్రాప్ బిల్డర్స్ ని ఉపయోగిస్తాము, అంటే టెక్నాలజీ ని ఉపయోగించి మనకి డెవలపర్స్ ఒక ప్లగిన్ ని తయారు చేస్తారు, అయితే దానిని మనం ఒక ప్లగిన్ రూపంలో మన వెబ్సైటు లో ఇన్స్టాల్ చేసుకొని వాటిని ఉపయోగిస్తాం.

drag and drop builder

Drag and Drop Builderలో చాలా రకమైన ఎలెమెంట్స్ అనేవి ఉంటాయి, వాటిని మనం సింపుల్ గా డ్రాగ్ చేసి మన పేజీ లో డ్రాప్ చేసి అందులో ఉన్న కంటెంట్ ని మనకి అనుకూలంగా మాడిఫై చేసుకుంటాం. ఉదాహరణకి, మనకి ఒక ఇమేజ్ స్లైడర్ కావాలి అనుకుందాం, మనం వర్డుప్రెస్ లో డైరెక్ట్ గా ఇమేజ్ స్లైడర్ ని పెట్టాలి అనుకుంటే మనకి మంచి కోడింగ్ స్కిల్స్ అనేవి అవసరం, అయితే కోడింగ్ లేకుండా డ్రాగ్ అండ్ డ్రాప్ బిల్డర్ లో ఇమేజ్ స్లైడర్ ఎలిమెంట్ ని పేజీ లోకి డ్రాప్ చేసి ఆ ఇమేజ్ స్లైడర్ లో మనకి కావాల్సిన ఇమేజెస్ ని పెట్టుకుంటాం.

అలాగే మనకి హెడర్ సెక్షన్ కావాలి అనుకుంటే డ్రాగ్ అండ్ డ్రాప్ బిల్డర్ నుంచి మనం ఒక హెడర్ సెక్షన్ ని పేజీ లోకి డ్రాప్ చేసి అందులో ఉన్న కంటెంట్ ని మన వెబ్సైట్ అవసరానికి అనుగుణంగా మార్చుకుంటాం.

Elementor Drag and Drop Builder

Drag and Drop Builderలో ముఖ్యంగా వినిపించే పేర్లు రెండు, ఒకటి ఎలెమెంటార్, ఇంకొకటి దివి. అయితే ఇందులో ఎలెమెంటార్ లో ఫ్రీ వెర్షన్ అండ్ ప్రీమియం వెర్షన్ ఉంటాయి, మనం ఫ్రీ వెర్షన్ ని డైరెక్ట్ గా వర్డుప్రెస్ నుంచి ఇన్స్టాల్ చేసుకొని ఉపయోగించవచ్చు.
Elementor Builder

Divi Drag and Drop Builder

దివి Drag and Drop Builder లో మాత్రం కేవలం ప్రీమియం వెర్షన్ మాత్రమే ఉంటాది, అది ఒక $90 పెట్టి కొనుక్కున్నట్టు అయితే మనం ఎన్ని వెబ్సైట్స్ లో ఐన దివి ని ఇన్స్టాల్ చేసుకొని ఉపయోగించవచ్చు.

Divi Builder
మనం ఒకవేల లెర్నింగ్ స్టేజి లో ఉన్నట్లయితే మనకి ఎలెమెంటార్ drag & drop builder ఫ్రీ వెర్షన్ అనేది సరిపోతుంది. క్రమక్రమంగా మనం వర్డుప్రెస్ లో లెర్నింగ్ స్టేజి నుంచి ఎక్స్పర్ట్ స్టేజి కి వెళ్తున్నప్పుడు, మనకి క్లైంట్స్ రెగ్యులర్ గా దొరుకుతునప్పుడు మనం దివి ని కొనుక్కుంటే సరిపోతుంది.


Share this article

Leave a Reply