You are currently viewing Digital Marketing in 2020

Digital Marketing in 2020

Share this article

Digital Marketing, ఈ మధ్య కాలం లో ఎక్కువ వినిపించే పదాలలో ఇది ఒకటి. స్టూడెంట్స్ నుంచి రిటైర్డ్ ఎంప్లాయిస్ వరకు అందరు డిజిటల్ మార్కెటింగ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే వీరిలో చాలా మంది తాము అనుకున్నది సాధించక ముందే ప్రయత్నాన్ని ఆపేస్తున్నారు. ముందుగా మనం అసలు ఈ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, దాని వల్ల మన లైఫ్స్టైల్ లో ఎలాంటి మార్పులు వచ్చాయో తెలుసుకుందాం.

ఇమెయిల్ మార్కెటింగ్, కంటెంట్ మార్కెటింగ్, బ్లాగింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఆన్లైన్ యాడ్స్ … ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ వస్తుంది, ఇవన్నీ డిజిటల్ మార్కెటింగ్ లో భాగమే.

ఈ 21 వ శతాబ్దంలో ప్రతిదీ డిజిటల్‌గా మారడంతో, వ్యాపారులు తమ వ్యాపారాలను ఆన్‌లైన్‌లోకి తీసుకురావడం ద్వారా చాలా లాభాలను ఆర్జించాయి మరియు ఆన్‌లైన్ వ్యాపారం నుండి ఎదుర్కొంటున్న భారీ పోటీ కారణంగా ఆఫ్‌లైన్ వ్యాపారాలు నష్టపోతున్నాయనడంలో సందేహం లేదు. డిజిటల్ మార్కెటింగ్ వల్ల వచ్చిన కొన్ని మార్పులని మనం గమనించినట్లు అయితే, కొన్ని సంవత్సరాల ముందు మనం రోజు పొద్దున్నే పేపర్ కొని తెచ్చుకుని చదివేవాళ్ళం , కానీ ఇప్పుడు మనకి ఈ-పేపర్స్ ఆన్లైన్ లో అందుబాటులో ఉంటున్నాయి, అలాగే ఇంతకు ముందు మనం TV లలో యాడ్స్ చూసి కొత్త కొత్త ప్రొడక్ట్స్ గురించి తెలుసుకునేవాళ్ళం , కానీ ఇప్పుడు మనకి కొత్త ప్రొడక్ట్స్ ని పరిచయం చేస్తుంది ఫేస్బుక్ & ఇంస్టాగ్రామ్ యాడ్స్, మరియు ఇతర డిజిటల్ ప్లాటుఫార్మ్స్ అనడం లో సందేహం లేదు.పెరుగుతున్న జనాభా తో పాటుగా ఇంటర్నెట్ ని ఉపయోగించే యూజర్స్ సంఖ్య కూడా పెరుగుతూనే వస్తుంది, బ్రాండ్స్ కూడా వీటిని అదనుగా  తీసుకుంటున్నాయి, వ్యాపారాలు అన్ని ఇప్పుడు డిజిటల్ ప్లాటుఫార్మ్స్నే ఉపయోగించడానికి ఇష్టపడుతున్నాయి . మరొక ఉదాహరణ తీసుకుంటే ,ఇంతకు ముందు మనం బైటికి మార్కెట్ కి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా కావాల్సిన చిల్లర ని తీసుకొని వెళ్లే వాళ్ళం , కానీ ఇప్పుడు మన జేబులో  పర్సు లేకపోయినా ఒక్క మొబైల్ ఉంటే చాలు అనుకుంటూ వెళ్లి పోతున్నాం, ఎందుకంటే మార్కెట్ లో కిల్లీ వ్యాపారి నుంచి ప్రతి ఒక్కరూ డిజిటల్ పెమెంట్స్ ని తీసుకుంటున్నారు కాబట్టి.

digital marketing

Digital Marketing లో వెబ్సైటు పాత్ర

అయితే Digital Marketing లో వెబ్సైటు పాత్ర ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఫేస్బుక్ మార్కెటింగ్, ఇంస్టాగ్రామ్
మార్కెటింగ్, ఇలా ఎన్ని సోషల్ మీడియా మార్కెటింగ్స్ చూసుకున్నా అవన్నీ వేరే థర్డ్ పార్టీ అప్లికేషన్ మీద డిపెండ్ అయ్యి చేస్తుంటాం. కానీ మనకి అంటూ ఒక వెబ్సైటు ఉన్నట్లయితే అది మన సొంత ప్లాటుఫార్మ్ అవుతుంది, అందులో మనకి నచ్చిన కంటెంట్ ని మనం ఆడియన్స్ కి చూపించగలం, దాని ద్వారా మన బిజినెస్ అనేది 24 గంటలు ఆన్లైన్ లో ఓపెన్ చేసి ఉంటాది. వెబ్సైట్ ని మనం మనకి నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. వర్డుప్రెస్ లాంటి కంటెంట్ మానేజ్మెంట్ సిస్టమ్ వచ్చిన తర్వాత అది మరింత సులభంగా తయారు అయ్యింది. ఒక డొమైన్ మరియు హాస్టింగ్ ఉన్నట్లయితే మనం వర్డుప్రెస్ ని ఉపయోగించి  కోడింగ్ లో మనకి అస్సలు ఏమి తెలియకపోయిన మంచి వెబ్సైట్స్ ని డిజైన్ చెయ్యగలం.

వెబ్సైట్స్ అనేవి కేవలం బిజినెస్ కోసమే పెట్టాలి అని లేదు. మనకి అంటూ ఒక పోర్టుఫోలియో లేదా రెస్యూమె కోసం కూడా వెబ్సైటు ని డిజైన్ చేస్కోవచ్చు. స్టూడెంట్స్ కి వెబ్సైటు అనేది ఉంటె దానిని వాళ్ళు తమ లింకెడిన్, ఫేస్బుక్ ప్రొఫైల్ లో పెట్టుకుంటే అది సాధారణ రెస్యూమె కంటే ప్రొఫెషనల్ గా ఉంటుంది.
రైటింగ్ లేదా పోయెట్రీ అంటే ఆసక్తి ఉన్న వాలు కూడా ఒక బ్లాగ్ సైట్ ని స్టార్ట్ చేయవచ్చు , వాళ్ళు కాళీగా ఉన్న టైమ్ లో ఏదోకటి పోస్ట్ చేస్తు ఉండి, మంచి కంటెంట్ ని గనుక డెలివర్ చేస్తే కచ్చితంగా ఆడియన్స్ రెగ్యులర్ గా వస్తుంటారు. అప్పుడు మనం గూగుల్ యాడ్సెన్స్, అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా మన సైట్ ని మోనేటైజ్ చేసి డబ్బులు సంపాదించడం మొదలుపెట్టవచ్చు.

Digital Marketingలో మనకి ఏ స్కిల్ ఉన్నా సరే అది మన సొంతానికి కాకుండా ఇతర బిజినెస్సులు కోసం కూడా మనం మన సర్వీస్ ని ప్రొవైడ్ చేసి వాళ దగ్గర నుంచి మనం ఎంతో కొంత అమౌంట్ అనేది ఛార్జ్ చెయ్యొచ్చు. ఉదాహరణకి  నాకు ఫేస్బుక్ యాడ్స్ తో మంచి అనుభవం ఉండి ఉంటె, మార్కెట్ లో ఫేస్బుక్ యాడ్స్ ఎక్స్పర్ట్ కోసం చూస్తున్న బిజినెస్స్ ని కాంటాక్ట్ చేసి నేను మీకు ఫేస్బుక్ యాడ్స్ చేసి పెడతాను మీరు నాకు ఇంత అమౌంట్ ఇవ్వండి అంటే మనకి కచ్చితంగా ప్రాజెక్ట్ అయితే వస్తుంది. ఇతర డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ కి కూడా ఇదే  వర్తిస్తుంది, నాకు వెబ్సైట్ డిజైన్ చెయ్యడం వచ్చు మీ బిజినెస్ ని ఆన్లైన్ లో పెట్టడం ద్వారా పలానా లాభాలు ఉంటాయి అని మనం క్లియర్ గా వివరిస్తే   మనకి బాగా తెలిసిన వాళ్ళనుంచే మనం ప్రాజెక్ట్స్ తెచుకోగలం.

Digital Marketing ఫీల్డ్ లో ఉన్న ఇంకొక అదనపు లాభం ఏంటంటే మనం దీనిని పార్ట్ టైం గా చేసుకోవచ్చు, వెబ్సైటు డిజైన్ చెయ్యడానికి మనం ఆ కంపెనీ ఆఫీస్ కి వెళ్లి పని చెయ్యాల్సిన అవసరం లేదు, మన దగ్గర లాప్టాప్ ఉండి , మంచి ఇంటర్నెట్ ఉంటె మనం వెబ్సైట్ ని డిజైన్ చేసి వాళ్లకి ఇవ్వగలం. అందుకే Digital Marketing ఫీల్డ్ లో స్టూడెంట్స్ నుంచి రిటైర్డ్ ఎంప్లాయిస్ వరకు అందరు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.


Share this article

Leave a Reply