Subdomain అనే కాన్సెప్ట్ మనకి ఎప్పుడు ఉపయోగపడ్తుంది అంటే, మనం ముందుగా మన దగ్గర ఉన్న డొమైన్ కి ఏదైనా ఎక్స్టెన్షన్ ని కలిపి పూర్తిగా ఇంకొక వెబ్సైట్ ని తయారుచేయాలి అనుకున్నపుడు ఉపయోగపడ్తుంది. అంటే ఇప్పుడు నా దగ్గర learnwptelugu.com అనే డొమైన్ ఉన్నప్పుడు నేనే దీనికి నేను కింద చూపించిన లిస్ట్ లాగ ఏదైనా Subdomain ని తయారుచేసి దాంట్లో ఇంకొక వెబ్సైట్ ని డిజైన్ చేసుకోగలను.
- help.learnwptelugu.com
- demo.learnwptelugu.com
- support.learnwptelugu.com
మాములుగా మనం పెద్ద పెద్ద సైట్స్ కి సబ్ డొమైన్స్ ని చూస్తుంటాం, అవి ఎలా ఉంటాయి అంటే కింద ఉన్న లిస్ట్ చుడండి
గూగుల్ సబ్-డొమైన్స్
- blog.google.com
- developers.google.com
- help.google.com
- drive.google.com
- cloud. google
ఆపిల్ సబ్-డొమైన్స్
- apps.apple.com
- discussions.apple.com
పైన ఉన్న లిస్ట్ కేవలం మీకు ఒక ఐడియా రావడానికి నేను ఉదాహారానికి చూపించా, ఇలా మీరు చాలా సబ్-డొమైన్స్ ని చూసే ఉంటారు. అయితే గూగుల్, ఆపిల్, అమెజాన్ లాంటి పెద్ద కంపెనీస్ ఎలా అయితే Subdomains lo కొత్త సైట్ ని డిజైన్ చేసినట్టు మనం కూడా మనకి ఉన్న డొమైన్ కి Subdomains ని కలుపుకొని పూర్తిగా వీరే వెబ్సైట్ ని డిజైన్ చెయ్యగలం.
ఈ ప్రక్రియ పూర్తిగా ఉచితంగా చేసుకోగలం,ఎలాగో తెలుసుకోవాలి అంటే కింద ఉన్న వీడియో ని చుడండి.
