ఈరోజుల్లో వర్డుప్రెస్సు నేర్చుకోవడం అనేది చాలా మంచి నిర్ణయం, ఎందుకంటే ఈ ఇంటర్నెట్ యుగం లో ప్రతి ఒక్కరు, లేదా ప్రతి వ్యాపారి యజమానులు వాళ్లకి ఒక వెబ్సైట్ ఉండాలి అని అనుకుంటున్నారు, కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, మనం ఎటువంటి కోడింగ్ ని ఉపయోగించకుండా వర్డుప్రెస్సు అనే ఒక ఉచితమైన టూల్ ని ఉపయోగించి సొంతంగా మరియు సులభంగా వెబ్సైట్ డిజైన్ చేసుకోగలము. అది ఎలాగో నేను మేరుకు ఈ కోర్స్ లో చాలా వివరంగా ప్రతి ఒక్క పాయింట్ వివరించాను.
హలో! మీరు ఈ పేజీ ని ఓపెన్ చేసారు అంటే బహుశా మీకు వర్డుప్రెస్సు నేర్చుకొని దాని ద్వారా డబ్బులు సంపాదిద్దాం అని గాని లేదా మీ సొంతంగా వెబ్సైట్ ని తయారు చేసుకోడానికి అయ్యి ఉండొచ్చు.
మీరు ఇంకా ఈ కోర్స్ లో జాయిన్ అవ్వకపోయి ఉంటె, కింద ఉన్న లింక్ ని ఉపయోగించి జాయిన్ అవ్వండి. దాని తర్వాత మీరు ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివితే మీకు అర్ధం అవుతాది.
ఈ కోర్స్ ముఖ్యంగా రెండు భాగాలు గా విభజించబడింది, ఒకటి థియరీ ఇంకొకటి ప్రాక్టికల్, మొదటి 20 లెసన్స్ లో మీరు కేవలం థియరీ మాత్రమే నేర్చుకుంటారు, అంటే అసలు వెబ్సైట్ అంటే ఏంటి వంటి బేసిక్ ప్రశ్న నుంచి మన సొంతంగా డొమైన్ & హాస్టింగ్ కొనుగోలు చెయ్యడం వరకు ప్రతిదీ చాలా వివరంగా చెప్పడం జరిగింది.
Get Astra Thddseme!
ఈ క్రింది భాగం లో ఉన్న కంటెంట్ మీరు కోర్స్ లో జాయిన్ అయ్యాక చదివితే మీకు అర్ధం అవుతుంది, ఎందుకంటే నేను కోర్స్ లో ఏ టూల్స్ ని ఉపయోగించని అలాగే థీమ్స్ మరియు ప్లగిన్స్ అన్ని కూడా ఈ కింద ఆర్టికల్ లో ఉంటాయి. కోర్స్ లో జాయిన్ అవ్వకపోతే మీకు ఈ కింద ఉన్న కంటెంట్ ఏ విధంగా ఉపయోగపడదు.
ముందుగా మనం వెబ్ డిజైన్ నేర్చుకోడానికి మనం ఒక వెబ్సైట్ ని తయారు చెయ్యాలి, అప్పుడే మనకి కాన్సెప్ట్ అనేది క్లియర్ గా అర్ధం అవుతుంది, అలాగే మీరు గనుక కోర్స్ లో జాయిన్ అయ్యి ఉంటె, మీరు కింద ఉన్న బటన్ మీద క్లిక్ చేసి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి, జాయిన్ అయ్యేటప్పుడు మీరు కోర్స్ లో రిజిస్టర్ అవ్వడానికి ఉపయోగించిన మెయిల్ ని ఎంటర్ చేస్తేనే మీరు గ్రూప్ లోకి మిమ్మల్ని తీస్కుంటాం.అయితే, వెబ్సైట్ డిజైన్ చెయ్యడానికి మనకి ముందుగా ఒక డొమైన్ అలాగే హాస్టింగ్ స్పేస్ కావాలి, దాని కొరకు మనం కొంత ఖర్చుపెట్టాలి, తక్కువ ఖర్చులో హాస్టింగ్ దొరికే టాప్ మూడు ఒప్షన్స్ మీకు కింద ఉన్న లింక్స్ లో కనిపిస్తాయి, వాటిలో దేని నుంచి ఐన మీరు డిస్కౌంట్ రేట్ లో హాస్టింగ్ అలాగే డొమైన్ పొందవచ్చు. మీరు గనుక Hostinger లో కొనుగోలు చేస్తే మీకు డొమైన్ ఉచితంగా లభిస్తుంది, అలాగే నేను ఈ కోర్స్ లో Hostinger నుంచి కొనుగోలు చేసి వివరించాను, కాబట్టి మీకు ఎక్కడ ఎటువంటి డౌట్ రాకుండా ఉంటాది.
ఒకవేళ మీరు గనుక హాస్టింగ్ కొనుగోలు చెయ్యకుండా Local Host లో మీరు వెబ్ డిజైన్ నేర్చుకోవాలి అనుకుంటే మీరు ఈ కింద ఉన్న లింక్ ని ఉపయోగించి Bitnami వర్డుప్రెస్సు ఇన్స్టల్లర్ ని డౌన్లోడ్ చేసుకోండి.
డొమైన్ అండ్ హాస్టింగ్ కొనుగోలు చేసాక, మనం కోర్స్ లో వాటిని ఎలా సెటప్ చెయ్యాలి అలాగే కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అయితే చూసాం, SSL, Nameservers, Webmail ఇలా వీటిని అన్నిటి గురించి తెలుసుకున్నాక మనం ఈ కోర్స్ లో ప్రాక్టికల్ గా డిజైన్ చేయడం మొదలుపెడతాం, దాని కోసం ముందుగా మనం ఒక థీమ్ ని ఇన్స్టాల్ చెయ్యాలి, ఈ కోర్స్ లో మనం అస్త్ర అనే ఒక థీమ్ ని ఉపయోగిస్తున్నాం.
Astra థీమ్ ని డౌన్లొడ్ చెయ్యడానికి కింద ఉన్న లింక్ ని ఉపయోగించండి.
Astra థీమ్ ని మనం మన వెబ్సైట్ లో ఇన్స్టాల్ చేసి థీమ్స్ గురించి తెలుసుకున్నాక మనం ప్లగిన్స్ గురించి తెలుసుకుంటాం, అలాగే మనం ఈ సైట్ లో ఉపయోగించే ముఖ్యమైన ప్లగిన్స్ ని ఇన్స్టాల్ చెయ్యడం జరుగుతుంది. మనకి కావాల్సిన ప్లగిన్స్ లిస్ట్ ని మీరు కింద చూడగలరు.
ప్లగిన్స్, అలాగే థీమ్ ని సెట్ చేసుకున్నాక మనం డిజైన్ పార్ట్ మొదలుపెడతాం. అప్పుడు మీకు డెమో సైట్ లో ఉన్న కంటెంట్ కావాలి అనుకుంటే ఈ కింద ఉన్న డౌన్లోడ్ బటన్ ని క్లిక్ చేసి ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోండి.
మెయిన్ పేజెస్ డిజైన్ పూర్తిగా డిజైన్ చేసాక మనం లీగల్ పేజెస్ లో కంటెంట్ ఎలా పెట్టాలో చూస్తాం. లీగల్ పేజెస్ లో శాంపిల్ కంటెంట్ కొరకు కింద ఉన్న లింక్స్ ని ఉపయోగించండి.
Code for Woocommerce pages font
Code to change VAT to GST
