DomainName.com/wp-admin, సాధారణంగా మనం ఏదైనా వెబ్సైట్ ని వర్డుప్రెస్ లో డిజైన్ చేసాక దాని బ్యాక్ ఎండ్ ని ఓపెన్ చెయ్యడానికి మనం ఈ URLని ఉపయోగిస్తాం. అయితే వర్డుప్రెస్సు ని ఉపయోగించి చేసిన ప్రతి వెబ్సైట్ ఇదే URLని ఫాలో అవుతాయి. దాని వల్ల మనకి కొంచెం ఇబ్బంది అయితే ఎదురు అవుతుంది. అది ఏంటంటే , మన సైట్ వర్డుప్రెస్సు లో చేసింది అని హకెర్స్ కి గనుక తెలిస్తే వాళ్ళు చాలా సులభంగా మన wp-admin పేజీ ని ఓపెన్ చెయ్యగలరు, ఎలా అంటే మన DomainName.com/wp-admin అని ఎంటర్ చేసి మన లాగిన్ పేజీ లోకి ఎంటర్ అవుతారు. అక్కడ లాగిన్ యూసర్ నేమ్ మరియు పాస్వర్డ్ వాళ్లకి తెలియనప్పటికీ హాకింగ్ లో కొన్ని tricks ని ఉపయోగించి వాళ్లు మన సైట్ లోకి ఎంటర్ అవ్వడానికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి.
బ్రూట్-ఫోర్స్ అటాక్ (Brute-force Attack)- అంటే వివిధ రకమైన యూసర్ నేమ్ మరియు పాస్వర్డ్ ని ఉపయోగిస్తూ చేస్తూ చాలా రాండమ్ గా పరీక్షిస్తారు. అయితే అక్కడ రాండమ్ గా ఉపయోగించేవి వాళ్లు టైపు చేసి చూడరు, ఆటోమేటిక్ గా కంప్యూటర్ నుంచి వచ్చిన రిజల్ట్స్ ని అక్కడ ట్రై చేస్తారు. దీనిని మనం ట్రయిల్ అండ్ ఎర్రర్ మెథడ్ (Trail and Error Method) అని కూడా పిలవవచ్చు. అంటే, మనకి కావాల్సిన యూసర్ నేమ్ మరియు పాస్వర్డ్ మ్యాచ్ అయ్యే వరకు ఒక్కొక్కటి పరీక్షిస్తారు.
అయితే దీని అంతటికి ఒక పరిష్కారం ఉంది, అది ఏంటి అంటే మనం మన wp-admin URL ని మార్చుకోవడం. wp-admin మార్చుకోవడం వలన మన సైట్ యొక్క wp-admin లేదా wp-login పేజీ ని ఎవరు ఓపెన్ చెయ్యడానికి కుదరదు.
wp-అడ్మిన్ యుఆర్ఎల్ ని మార్చుకోడానికి మనం ఒక ఫ్రీ ప్లగిన్ ని ఉపయోగిస్తాం. దాని వలన మనం మన wp-admin కి బదులుగా మనకి నచ్చిన లింక్ అక్కడ పెట్టుకోవచ్చు. ఉదాహరణికి DomainName.com/wp-admin/site, DomainName.com/wp-admin/mysite DomainName.com/wp-admin/access… ఇలా మనకి నచ్చిన అలాగే మనకి గుర్తు ఉండే ఏదైనా లింక్ ని మనం wp-admin ని బదులుగా పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ కూడా మనం అందరు ఉపయోగించే సైట్, అచ్చెస్స్, మిసైతే లాంటి జనరల్ లింక్స్ ని ఉపయోగింవ్హాకూడదు. ఏదైనా కష్టంగా లేదా ఎవరు ఊహించని లింక్ ని పెట్టుకోవాలి, దాని ద్వారా మన మన సైట్ ని కాపాడుకోగలం.
మీరు మీ వర్డుప్రెస్ వెబ్సైట్ ని హాకింగ్ కి గురి అవ్వకుండా URLని మార్చుకొని కాపాడుకోడానికి కింద ఉన్న వీడియో ని చుడండి.
