WordPress Login Page – మనం మన వర్డుప్రెస్సు వెబ్సైటు లో చూసే మొదటి పేజీ ఇదే. డొమైన్ ఏదైనా గాని, ఎక్స్టెన్షన్ ఏదైనా గాని. ముందుగా మనం మన వర్డుప్రెస్ సైట్ ని access చెయ్యాలంటే మనం లాగిన్ పేజీ ని ఓపెన్ చెయ్యాల్సిందే. లాగిన్ పేజీ ని access చెయ్యడం కోసం, మనం మన domainname.com/wp-admin లేదా domainname.com/wp-login అనే యుఆర్ఎల్ ని ఉపయోగిస్తాం. అయితే డిఫాల్ట్ గా వర్డుప్రెస్ ని ఇన్స్టాల్ చేసినప్పుడు మనకి మనం లాగిన్ పేజీ అనేది కింద ఉన్న విధంగా కనిపిస్తుంది.
వర్డుప్రెస్ డిఫాల్ట్ లాగిన్ పేజీ డిజైన్
అయితే, మనం ఈ పేజీ ని ఇలా ఉంచి ఉపయోగించినా లేదా కస్టమ్ స్టైలింగ్ ఇచ్చినా మన సైట్ పెర్ఫార్మన్స్ లో ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. ఇది మనకి ఎప్పుడు ఉపయోగపడ్తుంది అంటే మన ఎవరైనా క్లయింట్ కోసం వెబ్సైటు డెవలప్ చేసి వాళ్లకి ఇచ్చేటప్పుడు లాగిన్ పేజీ ని గనుక మనం నీట్ గా వాళ బ్రాండ్ కి తగట్టు డిజైన్ చేసి ఇస్తే అది మనకి ఒక ప్లస్ పాయింట్ లాగ కలసివస్తుంది.
లాగిన్ పేజీ డిజైన్ మార్చడం కోసం మనం ఎటువంటి డబ్బు ని ఖర్చు చెయ్యక్కర్లేదు. వర్డుప్రెస్ లో ఉన్న ఫ్రీ ప్లగిన్ ని ఉపయోగించి మనం డిజైన్ చెయ్యగలం. ఉదాహరణకు నేను మన వెబ్సైటు అంటే learnwptelugu.com యొక్క లాగిన్ పేజీ డిజైన్ ని మార్చాను, కింద ఉన్న ఫోటో లో మీరు మార్చిన లాగిన్ పేజీ డిజైన్ ని చూడగలరు.
మీరు కూడా మీ లాగిన్ పేజీ ని లేదా మీ క్లయింట్ యొక్క లాగిన్ పేజీ ని డిజైన్ చెయ్యాలి అనుకున్నట్టు అయితే కింద ఉన్న వీడియో ని చుడండి.


