You are currently viewing What is a Blog | Make money with BLOG

What is a Blog | Make money with BLOG

Share this article

Blogడిజిటల్ మార్కెటింగ్ ద్వారా డబ్బులు సంపాదించడానికి మనకి ఉన్న ఒక అతి పెద్ద మార్గం. అయితే చాలా మంది కొత్తగా డిజిటల్ మార్కెటింగ్ లోకి ఎంటర్ అయ్యే వాళ్లకి ఈ బ్లాగ్ అనే కాన్సెప్ట్ గురించి, అలాగే బ్లాగ్ నుంచి డబ్బులు ఎలా సంపాదించాలి అనే కాన్సెప్ట్ గురించి చాలా సందేహాలు ఉంటాయి, ఈ బ్లాగ్ పోస్ట్ లో మనం ఆ సందేహాలు అన్నిటినీ క్లియర్ చేసుకోడానికి ప్రయత్నిద్దాం.

అసలు విషయం లోనికి వెళ్లే ముందు, blog అంటే ఏమిటి? ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఇది. అలాగే blog కి వెబ్సైటు కి ఉన్న తేడా కూడా మనం గమనించాలి.

బ్లాగ్ అంటే ఏమిటి?

వెబ్సైట్లలో చాలా రకాలు ఉంటాయి, ఈ-కామర్స్ వెబ్సైట్, లెర్నింగ్ వెబ్సైట్, బిజినెస్ వెబ్సైట్… ఇలా చాలా రకమైన వెబ్సైట్లు మనకి అందుబాటులో ఇంటర్నెట్ లో ఉంటాయి, blog అనేది కూడా ఒక రకమైన వెబ్సైట్ కిందకి వస్తుంది. అయితే మనకి మాములుగా వెబ్సైట్ లో పేజెస్ కనపడితే, బ్లాగ్ వెబ్సైట్ లో మాత్రం పోస్ట్లు కనపడతాయి. పోస్ట్ ద్వారా కంటెంట్ ని డెలివర్ చేయడాన్నే మనం బ్లాగింగ్ అని పిలుస్తాం. ఆ పోస్ట్లు అనేవి దేని గురించి ఐన కావచ్చు, చదువు కి సంబంధించినది కావొచ్చు, స్టాక్ మార్కెట్ కి సంబంధించినది కావొచ్చు, మీరు ఇప్పుడు చదువుతున్నది కూడా ఒక బ్లాగ్ పోస్ట్ కిందకి వస్తుంది, అలాగే ఈ పోస్ట్ ని నేను learnwptelugu.com అనే వెబ్సైట్ లో పెట్టడం జరిగింది.

వెబ్సైట్ కి బ్లాగ్ కి ఉన్న మరొక ముఖ్య తేడా ఏమిటి అంటే, వెబ్సైట్ అనేది మనం రెగ్యులర్ గా అప్డేట్ చెయ్యం, కానీ బ్లాగ్ ని మనం రెగ్యులర్ గా కొత్త పోస్ట్స్ తో అప్డేట్ చేస్తూ ఉంటాం.

బ్లాగ్ ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Blog ద్వారా డబ్బులు సంపాదించే కొన్ని మార్గాలలో గూగుల్ యాడ్సెన్స్ అనేది అతి ముఖ్యమైనది, మనం బైట చూసినట్టు, బిల్డింగ్స్ మీద కంపెనీస్ hoardings పెట్టుకొని ఆ బిల్డింగ్ ఓనర్ కి ఎలా అయితే అద్దె చెల్లిస్తారో, అదే విదంగా మన వెబ్సైట్ లో ఖాళి స్పేస్ లో గూగుల్ యాడ్స్ పెట్టుకొని మనకి డబ్బులు చెల్లిస్తుంది. అయితే ప్రతి వెబ్సైట్ లో గూగుల్ యాడ్స్ పెట్టాలి అనుకోడు, కేవలం క్వాలిటీ ఉన్న బ్లాగ్ సైట్స్ లో మాత్రమే యాడ్స్ పెట్టుకొని మనకి డబ్బులు చెల్లిస్తుంది. hoardings కూడా అదే విదంగా పనిచేస్తాయి కదా, కేవలం జన సంచారం ఎక్కువ ఉండి ఎక్కడ అయితే hoarding ని ఎక్కువ మంది చూడగలిగే ఛాన్స్ ఉంటుందో అక్కడే hoardings పెట్టి బిల్డింగ్ ఓనర్స్ కి డబ్బులు చెలిస్తాయి.

బ్లాగ్ ద్వారా అనేక ఉపయోగాలు ఉంటాయి, మనం ఇంతకు ముందు ఈ ఆర్టికల్ లో చదివినట్లు, డిజిటల్ మార్కెటింగ్ లో డబ్బులు సంపాదించడానికి మనకి ఉన్న అత్యుత్తమ మార్గాలలో బ్లాగింగ్ ఒకటి. ఎందుకంటే బ్లాగ్ లో మనం కేవలం క్వాలిటీ ఉన్న కంటెంట్ ని ప్రొవైడ్ చేసి మన బ్లాగ్ నుంచి డబ్బులు సంపాదించడం మొదలుపెట్టవచ్చు.

అయితే, ఒకవేళ గూగుల్ మన సైట్ లో యాడ్స్ పెట్టకపోయినా మనకి ఇతర మార్గాలు చాలా ఉన్నాయి, వాటిలో అఫిలియేట్ మార్కెటింగ్ ఒకటి, అలాగే మెంబర్షిప్ ద్వారా, ప్రైవేట్ ఫోరమ్స్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మార్గాల ద్వారా మనం బ్లాగ్ నుంచి డబ్బులు సంపాదించ వచ్చు.
అయితే ఇవన్నీ జరగాలి అంటే ముందు మనం ఒక బ్లాగ్ ని లేదా ఒక వెబ్సైట్ ని మొదలుపెట్టాలి.

నాకు అసలు కోడింగ్ రాదు, మరి నేను బ్లాగ్ ని రన్ చేయగలనా?

కోడింగ్ లో మనకి ఎటువంటి పరిజ్ఞ్యానం లేకపాయినా వర్డుప్రెస్ ని వాడుకొని అద్భుతమైన blog లేదా వెబ్సైట్ ని మనం తయారుచెయ్యగలం. బ్లాగ్ ని సక్సెస్ చెయ్యడానికి మనకి కోడింగ్ పరిజ్ఞ్యానం ఉన్నా లేకపోయినా మంచి కంటెంట్ ని డెలివర్ చెయ్యగలిగే కెపాసిటీ ఉండాలి. ఎందుకంటే మన బ్లాగ్ ని ఎంత మంది ఇష్టపడి చదివితే అంత మందికి అది రీచ్ అవుతుంది, దాని ద్వారా మీ బ్లాగ్ కి మంచి ర్యాంకింగ్ అలాగే రీచ్ వస్తుంది. దాని వాళ్ళ మీరు మీ బ్లాగ్ ద్వారా డబ్బులు సంపాదించడం అనేది ఇంకా ఈజీ గా ఉంటుంది. మీరే చెప్పండి బైట ఏదైనా షాప్ లో కస్టమర్స్ ఎక్కువగా వచ్చే షాప్ త్వరగా లాభాలు చేసుకుంటుందా లేదా కాళీ గా ఉంటున్న షాప్ లాభాలు చేసుకుంటుందా?

అయితే బ్లాగ్ లో మనం ఎంత రెగ్యులర్ గా కంటెంట్ ని అప్డేట్ చేస్తూంటామో అంత ఎక్కువ రీచ్ మరియు ఎంగేజ్మెంట్ మనకి వస్తుంది. ఈ రెండు ఎంత ఎక్కువ ఉంటె అంత మంచిది.

చాలా మందికి రెగ్యులర్ గా బ్లాగ్ ని అప్డేట్ చేయడం పెద్ద కష్టంగా ఉంటుంది, తప్పు లేదు. ఎదుకంటే మనం ఏ టాపిక్ ని అయితే ఇష్టపడతామో ఆ టాపిక్ మీద బ్లాగ్ పెడితే మనం ఇష్టంగా దానిని కొత్త కంటెంట్ తో అప్డేట్ చెయ్యగలం.
సో, మీరు కూడా మీకు ఏ టాపిక్ అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ టాపిక్ మీద బ్లాగ్ మొదలుపెట్టండి.

ఉదాహరణికి, మీరు స్టాక్ మార్కెట్ ని ఫాలో అవుతూ దాని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలిసినట్టు అయితే స్టాక్ మార్కెట్ కి సమందించిన ఒక బ్లాగ్ ని మొదలుపెట్టండి, లేదా మీకు క్రికెట్ మీద మంచి పట్టు ఉంటె, క్రికెట్ న్యూస్ లేదా టిప్స్ కి సంబంధించిన బ్లాగ్ ని మొదలుపెట్టండి, ఇలా మీకు ఏ రంగం లో అయితే మంచి అనుభవం అలాగే ఇంట్రెస్ట్ ఉందొ, ఆ ఫీల్డ్ లో బ్లాగ్ పెడితే మీరు ఎక్కువ శ్రమించకుండా మీ బ్లాగ్ ని రన్ చెయ్యగలరు.

బ్లాగ్ ని ప్రారంభించండి ఇలా…

ప్రస్తుతం ఉన్న పరిస్థితిలలో మనం బ్లాగ్ ని మొదలుపెట్టడానికి వర్డుప్రెస్ అనేది ఒక మంచి ప్లాట్ఫారం, ఎందుకంటే అది మనకి ఫ్రీ గా లభిస్తుంది, కేవలం డొమైన్ అండ్ హోస్టింగ్ మనం కొనుకున్నట్టు అయితే మనం మన ఫస్ట్ బ్లాగ్ ని మొదలుపెట్టవచ్చు.

వర్డుప్రెస్ అంటే ఏంటి, దాని వాళ్ళ మనకి ఉండే ఉపయోగాలు చదవడానికి ఈ లింక్ ని క్లిక్ చెయ్యండి.

బ్లాగ్ మొదలు పెట్టడానికి మనకి కావాల్సినవి

  1. డొమైన్ నేమ్
  2. హాస్టింగ్
  3. ఇంటర్నెట్ కనెక్షన్

పైన ఉన్న మూడు కాకుండా మనకి డెడికేషన్, టైం కూడా ఉండాలి. కేవలం రోజుకి ఒక గంట కేటాయించినా మనం మన బ్లాగ్ ని డెవలప్ చేసుకోగలం.

 


Share this article

Leave a Reply