You are currently viewing Hosting అంటే ఏమిటి?? | 5 Types of Hosting

Hosting అంటే ఏమిటి?? | 5 Types of Hosting

Share this article

Hosting అనేది ఒక ఆన్లైన్ సర్వీస్, మన వెబ్సైట్ ని ఆన్లైన్ లో ఉంచడానికి మనం వెబ్ హాస్టింగ్ ని ఉపయోగిస్తాం.
మన వెబ్సైట్ ని ఇంటర్నెట్ కి కనెక్ట్ చెయ్యాలి అంటే మన వెబ్సైట్ ఫైల్స్ ని ఒక సర్వర్ లో అప్లోడ్ చెయ్యాలి, ఆ సర్వర్లు ప్రపంచం లో ఇంటర్నెట్ కి కనెక్ట్ అయ్యి ఉన్న ప్రతి డివైస్ కి డేటా ని పంపిస్తాయి లేదా స్వీకరిస్తాయి. ఇంటర్నెట్ ని కనెక్ట్ చేసి ఉన్న డివైస్ లో మన వెబ్సైట్ Domain Name ని ఎంటర్ చెయ్యగానే సర్వర్ లో ఉన్న వెబ్సైట్ ఫైల్స్ అనేవి ఆ డివైస్ లో డిస్ప్లే అవుతాయి. ఈ ప్రాసెస్ ని మనం హాస్టింగ్ అని పిలుస్తాం.
Web Hosting తీసుకోవాలి అంటే ముందుగా మన దగ్గర డొమైన్ ఉండాలి. డొమైన్ గురించి మరింత వివరాలు తెలుసుకోడానికి ఈ లింక్ ని క్లిక్ చెయ్యండి. డొమైన్ నేమ్ కి మన హాస్టింగ్ సర్వీస్ ప్రొవైడర్ ఇచ్చిన నేమ్ సర్వర్స్ ని కనెక్ట్ చేస్తే ఎవరైనా మన డొమైన్ నేమ్ ని సెర్చ్ చేసినప్పుడు, ఆ డొమైన్ నేమ్ కి లింక్ అయ్యి ఉన్న హాస్టింగ్ లో ఉన్న ఫైల్స్ అనేవి ఓపెన్ అవుతాయి.
మన అంతట మనం ఒక సర్వర్ ని కొనుక్కొని మైంటైన్ చెయ్యడం కష్టం కాబట్టి మన కోసం, హాస్టింగ్ కంపెనీస్ అనేవి మనకి సర్వర్ కంప్యూటర్ లో కొంత స్పేస్ ని మనకి అమ్ముతారు.
మన వెబ్సైట్ క్వాలిటీ అనేది మనం ఎంచుకున్న హాస్టింగ్ క్వాలిటీ బట్టి ఉంటది, హాస్టింగ్ గనుక సరిగ్గా లేకపోయినట్లయితే మన వెబ్సైట్ ఎక్కువ సార్లు డౌన్ అవ్వడం, స్లో అవ్వడం లేదా హాకింగ్ కి గురి అవ్వడం జరుగుతుంది .
హాస్టింగ్ ప్లాన్ కొనేటప్పుడు మనం కొన్ని పారామీటర్స్ ని గమనిస్తూ ఉండాలి..

  • RAM
  • Bandwidth
  • SSL Certificate
  • Email Accounts
  • Customer Support
  • Hosting Space
  • Backup Feature

వివిధ రకమైన Web Hosting

వెబ్ హాస్టింగ్ లో పలు రకమైన సర్వీసెస్ అనేవి ఉంటాయి, వాటిలో ఒక్కొక్కదానికి వివిధ రకమైన పాసిటివ్స్ అలాగే నెగేటివ్స్ ఉంటాయి. ఎక్కువగా మనం ఉపయోగించే హాస్టింగ్ టైప్స్ చూసినట్టు అయితే

  • షేర్డ్ హాస్టింగ్
  • VPS హాస్టింగ్
  • క్లౌడ్ హాస్టింగ్
  • డెడికేటెడ్ హాస్టింగ్
  • వర్డుప్రెస్ హాస్టింగ్

షేర్డ్ హాస్టింగ్ – Shared Hosting

హాస్టింగ్ రకాలలో ఎక్కువగా దీనినే ఉపయోగిస్తారు ఎందుకంటే ఇది చాలా చీప్ గా వస్తుంది ఎందుకంటే షేర్డ్ హాస్టింగ్ లో మనం సర్వర్ లో ఇతర వెబ్సైట్స్ తో స్పేస్ మరియు ప్రాసెసింగ్ పవర్ ని షేర్ చేసుకుంటాం. అప్పుడే స్టార్ట్ చేసిన Businesses, అలాగే చిన్న స్థాయి బ్లాగ్లు, షేర్డ్ హాస్టింగ్ మీద ఆధారపడతాయి. అయితే మిగతా హాస్టింగ్ రకాలతో పోల్చుకుంటే దీనిలో కొంచెం మైనస్ పాయింట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఉదాహారానికి, స్పేస్ మరియు రామ్ ని షేర్ చేసుకోవడం వలన మిగతా వెబ్సైట్స్ యొక్క పెర్ఫార్మన్స్ మన వెబ్సైట్ మీద పడుతుంది, ఒకవేళ మనం షేర్ చేసుకున్న సర్వర్ లోనే ఇంకో వెబ్సైట్ మీద హాకింగ్ దాడి జరిగి వైరస్ ఎటాక్ జరిగినట్టు అయితే అది సర్వర్ లో స్పేస్ షేర్ చేసుకుంటున్న మిగతా వెబ్సైట్స్ మీద కూడా పడుతుంది, వాటికి కూడా ఆ అట్టాక్ అనేది ఇంపాక్ట్ చూపించి అవి కూడా డౌన్ అయ్యే ప్రమాదం ఉంది. అయితే షేర్డ్ హాస్టింగ్ లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే మనకి టెక్నికల్ నాలెడ్జి లేకుండా కూడా మనం ఈజీ గా మేనేజ్ చెయ్యగలం.

VPS హాస్టింగ్ – Virtual Private Server Hosting

VPS హాస్టింగ్ అంటే షేర్డ్ హాస్టింగ్ లో స్పెషల్ క్యాటగిరీ, అంటే సర్వర్ లో మనకి అంటూ సెపరేట్ గా స్పేస్ అలాగే మెమరీ ని హాస్టింగ్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, అంటే మిగతా వెబ్సైట్స్ యొక్క పెర్ఫార్మన్స్ మన వెబ్సైట్ ని ప్రభావితం చెయ్యలేవు. షేర్డ్ హాస్టింగ్ తో పోల్చుకుంటే VPS హాస్టింగ్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అయితే అదే స్థాయి లో మన వెబ్సైట్ స్పీడ్ అండ్ పెర్ఫార్మన్స్ పెరుగుతాది. VPS హాస్టింగ్ ని మేనేజ్ చెయ్యడానికి మనకి సర్వర్ ని మేనేజ్ చెయ్యగలిగే టెక్నికల్ నాలెడ్జి అనేది అవసరం. మధ్య తరగతి Businesses ఎక్కువగా VPS హాస్టింగ్ ని ఉపయోగిస్తాయి.

క్లౌడ్ హాస్టింగ్ – Cloud Hosting

ఈ మధ్య కాలం లో అందరు క్లౌడ్ హాస్టింగ్ ని ఉపయోగిస్తున్నారు, దానికి కారణం అది చీప్ గా వస్తుంది అండ్ పెర్ఫార్మన్స్ కూడా హై లెవెల్ లో ఉంటుంది. క్లౌడ్ హాస్టింగ్ లో వెబ్సైట్ డౌన్ టైం అనేది చాలా తక్కువ ఉంటుంది. క్లౌడ్ హాస్టింగ్ లో మన వెబ్సైట్ డేటా అనేది ఒకటి కన్నా ఎక్కువ సర్వర్స్ లో స్టోర్ చెయ్యబడి ఉంటుంది అందువల్ల మన వెబ్సైట్ ని ఎవరైనా ఓపెన్ చెయ్యాలి అనుకున్నపుడు ఫ్రీ గా ఉన్న సర్వర్ నుంచి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతాది, దాని వల్ల వెబ్సైట్ స్పీడ్ గా లోడ్ అయ్యి బాగా స్పీడ్ గా పనిచేస్తుంది.

డెడికేటెడ్ హాస్టింగ్ – Dedicated Hosting

డెడికేటెడ్ హాస్టింగ్ అనేది ముఖ్యంగా పెద్ద పెద్ద బిజినెస్ ఉన్నవాళ్లు ఉపయోగిస్తారు . డెడికేటెడ్ అంటే మనకి అంటూ ఒక ప్రత్యేకమైన సర్వర్ ని మన హాస్టింగ్ కంపెనీ మనకి కేటాయిస్తుంది, మన సర్వర్ యొక్క మెమరీ, స్పేస్ ఇలా అన్ని మనం కాన్ఫిగర్ చేసుకునే వీలు ఉంటుంది. మనకి అంటూ సెపరేట్ గా ఒక సర్వర్ ని మనం తీసుకుంటున్నాం కాబట్టి మిగతా వాటితో పోలిస్తే ఇది కొంచెం కాస్ట్ ఎక్కువా. అయితే చాలా పెద్ద యూసర్ బేస్ ఉండి వెబ్సైట్ అసలు డౌన్ అవ్వకుండా ఉండాలి అనుకునే పెద్ద పెద్ద బిజినెస్స్ మాత్రమే డెడికేటెడ్ హాస్టింగ్ ని ఉపయోగిస్తాయి.

వర్డుప్రెస్ హాస్టింగ్ – WordPress Hosting

వర్డుప్రెస్ హాస్టింగ్ అనేది ఒక రకమైన షేర్డ్ హాస్టింగ్ లాంటిదే, కాకపోతే వర్డుప్రెస్ హాస్టింగ్ లో కేవలం వర్డుప్రెస్ వెబ్సైట్స్ మాత్రమే సర్వర్ ని షేర్ చేసుకుంటాయి. కేవలం వర్డుప్రెస్ కోసమే స్పెషల్ గా కాన్ఫిగర్ చెయ్యడం వాళ్ళ వర్డుప్రెస్ హాస్టింగ్ యొక్క స్పీడ్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. అలాగే వర్డుప్రెస్ సెక్యూరిటీ, బిల్డర్ ప్లగిన్స్ మరియు  మిగతా ముఖ్యమైన ప్లగిన్స్ అనేవి మనం వర్డుప్రెస్ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు ప్రీ-ఇంస్టాల్ల్డ్ గా వస్తాయి.

 


Share this article

Leave a Reply